సీఐని ఆశ్రయించిన వృద్ధదంపతులు... 

సీఐని ఆశ్రయించిన వృద్ధదంపతులు... 
  • కొడుకు సక్కగా అర్సుకుంటలేడని పిర్యాదు

ముద్ర, మల్యాల:కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన వృద్ధదంపతులు సోమవారం మల్యాల సీఐ బిల్ల కోటేశ్వర్ ని అశ్రయించారు. తమ పెద్దకొడుకు సక్కగా అర్సుకుoటలేడని పిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన గుడిపల్లి మాధవరెడ్డి(90), భార్య వీరవ్వ(85) సీఐని కలిసి తమకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని తెలుపారు. కూతురుకు పెళ్లి చేసి పంపడంతో పాటు, ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరు కొడుకులకు సమానంగా పంచినట్లు పేర్కొన్నారు. అయితే ఊరు పెద్దమనుషుల సమక్షంలో తమ బాధ్యత ఇద్దరు కొడుకులు తీసుకోని, వంతులవారీగా చూసుకోవాలని నిర్ణయించగా, పెద్ద కొడుకు గుడిపల్లి మల్లారెడ్డి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తిండి పెట్టకపోగా, తిడుతూ, మానసికవేదనకు గురిచేస్తున్నాడని వాపోయారు.

ఈ విషయంమై తమ పెద్ద కొడుకుకు కౌన్సిలింగ్ ఇచ్చి, వృద్ధాప్యoలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, తమను మంచిగా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐని వేడుకున్నారు. ఎండకు వచ్చిన వారికి సీఐ మర్యాదపూర్వకoగా త్రాగునీరు అందించి, వెంటనే వారి పెద్దకొడుకు సమాచారం ఇచ్చి, పిలిపించాలని సిబ్బందిని ఆదేశించారు. మంచిగా చూసుకునేలా చర్యలు తీసుకుంటానని కన్నీటి పర్యంతమైన ఆ వృద్ధదంపతులకు సీఐ కోటేశ్వర్ భరోసా కల్పించారు.