సర్వసభ్య సమావేశంలో పెట్రోల్ బాటిళ్ళతో సర్పంచుల నిరసన

సర్వసభ్య సమావేశంలో పెట్రోల్ బాటిళ్ళతో సర్పంచుల నిరసన

పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ హెచ్చరిక
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపిపి పాలెపు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సమావేశంలో పలు సమస్యలఫై చర్చ జరుగుతున్నా సమయంలో సర్పంచులు ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిళ్ళను చేతబట్టి సమవేశంలో మధ్యలో నిలబడి నిరసన తెలిపారు. గ్రామల్లో వైకుంట ధామాలు, ఇంకుడు గుంతలు, రైతువేదికలు నిర్మించామని ఎంబి రికార్డు అయిన బిల్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిల్లులు ఇవ్వకుంటే తమకు అతహత్యలె శరణ్యం అన్నారు. అయితే సర్పంచుల నిరసనఫై ఎంపిపి  మాట్లాడుతూ మీరు పెట్రోల్ పోసుకొని చస్తే బిల్లులు వస్తాయని అన్నారని ఆగ్రహించిన సర్పంచులు ఎంపిపి వైపు దూసుకెల్లె ప్రయత్నం చేశారు. అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధిలు అడ్డుకోని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎంపిపి అనుచిత వాక్యలను నిరసిస్తూ ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సర్పంచులు నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంపిఇఓ కందుకూరి రవిబాబు, మండల ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.