ప్రజారోగ్య పరిరక్షణకోసం ప్రభుత్వం కృషి-సర్పంచ్ ముల్కల గంగారాం

ప్రజారోగ్య పరిరక్షణకోసం ప్రభుత్వం కృషి-సర్పంచ్ ముల్కల గంగారాం

వెల్గటూర్, ముద్ర:  ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి. చేస్తుందని సర్పంచ్ ముల్కల గంగారాం అన్నారు.
బుధవారం వెల్గటూర్ మండలం లోని సంకేనపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం  మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక  బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తూ ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు.  తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని  ముఖ్యమంత్రి కేసీఆర్  ఎన్నో ఆరోగ్య ప్రయోజన పథకాలను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడంతో పాటు గా, శస్త్ర చికిత్సలు అందించడం గొప్ప కార్యక్రమని అన్నారు. ప్రతి ఒక్కర ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. మహిళల సంరక్షణ కోసం  ఎన్నో రకాల ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేశారని పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాపేశ్వరరావు , కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.