తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ :ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22  వరకు  మూడు జిల్లా లో ఘనంగా జరపాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల కు  సంబంధించి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పోలీస్ శాఖ పరంగా  చేయవలసిన ఏర్పాటలపై   సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ మూడు వారాల పాటు సాగే  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలతో పాటు పోలీస్ శాఖ నిర్వహించే సురక్ష దినోత్సవం, తెలంగాణ రన్ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. జూన్ 4న సురక్షా దినోత్సవం సందర్బంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు.

పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలని, పోలీస్ జాగృతి కళాకారుల బృందాలతో ప్రదర్శనలు. పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు,  పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన,  పెట్రోలింగ్ కార్స్, Blue colts, వెహికిల్స్ తోర్యాలీ నిర్వహించాలని సూచించారు. జూన్ 12న జిల్లా లోని అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసు శాఖ అధ్వర్యంలో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో క్రీడలు, యువజన సర్వీసులశాఖతో సమన్వయం చేసుకొని ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ప్రకాష్, రవీంద్రారెడ్డి, రవీంద్ర కుమార్, ఇన్స్పెక్టర్లు రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్, నాగేశ్వరరావు మరియు సి. ఐ లు కోటేశ్వర్, ప్రవీణ్ లక్ష్మీనారాయణ, రమణమూర్తి RI లు   వామనమూర్తి నవీన్ పాల్గొన్నారు.