కేసుల పరిష్కారం కోసం పోలీసులు కృషి చేయాలి..

కేసుల పరిష్కారం కోసం పోలీసులు కృషి చేయాలి..

జిల్లా జడ్జి నారాయణ బాబు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కేసుల పరిష్కారం కోసం పోలీసులు కృషి చేయాలని ప్రిన్సిపాల్, జిల్లా సెషన్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.నారాయణబాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో శనివారం పోలీస్ అధికారులతో నేషనల్ లోక్ అదాలత్ పై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఇప్పటివరకు 400లకు పైగా కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 10న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం చేసుకోవాలని వారు సూచించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎస్సైలు చాలా ఎక్కువ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. కేసులో ఇరు వర్గాలను సమన్వయ పరచడంలో పోలీస్ అధికారులది కీలక పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కాటారం డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, వివిధ మండలాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.