గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటింటి సర్వే

గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటింటి సర్వే

ముద్ర న్యూస్ రేగొండ: మండలంలో అన్ని గ్రామాల్లో గృహలక్ష్మి కి ధరకాస్తు చేసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సోమవారం రూపిరెడ్డీ పల్లి.చెన్నపూర్, గ్రామంలో చేపట్టారు . ఈ సందర్భంగా స్థానిక మండల ఎమ్మార్వో శ్రీనివాస్ స్వామి  మరియు మండల ప్రత్యేక అధికారి శామ్యూల్, ఎంపీడీఓ సురేందర్, కార్యదర్శి తో కలిసి ఇంటింటి సర్వేలో భాగంగా మొదటగా బీసీ కాలనీ నుండి మొదలుపెట్టినారు.
ప్రతి దరఖాస్తు దారుని ఇంటి ఇంటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తూ దరఖాస్తు దారుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుంటూ సర్వే చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారి కవిత,దేవేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..