బాల కార్మికులను నిర్మూలించి  - బాల మేధావులను తయారు చేద్దాం..

బాల కార్మికులను నిర్మూలించి  - బాల మేధావులను తయారు చేద్దాం..

శాయంపేట, ముద్ర : మండలంలోని   గట్లకానిపర్తి గ్రామంలో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఆర్థిక సహాయంతో  ఎఫ్ పి సి ఎల్ బీసీఐ ప్రాజెక్టు వారు బాల కార్మికుల సదస్సు నిర్వహించారు. బాల కార్మిక నీరోధక చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు వారి విద్య కి భంగం కలిగేలా కార్మికులుగా ఉండొద్దని శాయంపేట భారత సుస్థిర పత్తి యాజమాన్యం పథకం బిసిఐ ప్రాజెక్టు ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ ప్రియాంక రెడ్డి  కోరారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి, అలాగే చిన్నపిల్లలు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు దగ్గరలో ఉండకూడదని పురుగుమందు డబ్బాలకు దూరంగా ఉండాలని చెప్పారు  .ఈ సందర్బంగా బాల లలికలకు స్టాప్ చేయిల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్ పై డ్రయింగ్ కంపిటేషన్ నిర్వహించడం జరిగింది. చురుగ్గ పాల్గొన్న వారికి మొదటి బహుమతి డిక్షనరీ, రెండవ, మూడవ బహుమతి గా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, పాల్గొన్న వారందరికీ నోట్ బుక్స్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు,ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ రెడ్డి గారు , ఉపాధ్యాయులు భాస్కర్, విజయ్, శారద, వసంత మరియు ఫీల్డ్ ఫెసిలిటర్లు కుక్కల కల్పన, పోతు సునీల్, తరాల తిరుపతి పాల్గొన్నారు.