ఘనంగా తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ  జన్మదిన వేడుకలు

ఘనంగా తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ  జన్మదిన వేడుకలు

ముద్ర.వీపనగండ్ల:-తెలంగాణ రాష్ట్ర ప్రధాత తల్లి సోనియమ్మ 77వ జన్మదిన వేడుకలను చిన్నంబావి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు  సతీమణి సృజన కేక్  కట్  చేసి సోనియమ్మ  శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ళ స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ అని అన్నారు. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా నేడు అమలు చేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రతి మహిళ సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో  చిన్నంబావి మండల అధ్యక్షులు శేఖర్ యాదవ్, చిన్నంబావి సర్పంచ్ రంజిత్ కుమార్, నాయకులు చిదంబ రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణ ప్రసాద్ యాదవ్, బీచ్పల్లి యాదవ్, ఈదన్న యాదవ్ , బాల గౌడ్ తదితరులు ఉన్నారు.