రోడ్డు మలుపుల వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి - సిపిఐ జిల్లా నాయకులు

రోడ్డు మలుపుల వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి - సిపిఐ జిల్లా నాయకులు

ముద్ర,పానుగల్:-సుమారు ఏడాది వ్యవధిలో ప్రమాదాల్లో పదిమంది ప్రాణాలను బలిగొన్న మెట్టుపల్లి -అన్నారం రోడ్డుపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య డిమాండ్ చేశారు. పానగల్ మండలం కేతేపల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంజనగిరి గండి నుంచి గోపాలపురం క్రాస్ రోడ్ వరకు సుమారు పది కిలోమీటర్లు ఉంటుందని, ఈ ఏడాదిలో సగటున కిలోమీటర్ కు ఒకరు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

అంజనగిరి గండిలో బ్రిడ్జి వద్ద కారు ప్రమాదంలో ఒకరు, అంజనగిరి లో ముగ్గురు, సైకిల్ మోటార్ల ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఒకరు, అన్నారం వద్ద దావాజీ పల్లి కే చెందిన ఇద్దరు, దాబా వద్ద ఒకరు, అన్నారం గ్రామానికి చెందిన బాల పీరు, జమ్మాపురానికి చెందిన ఒకరు, గోపులాపూర్ స్టేజి వద్ద కిష్టాపూర్ కి చెందిన ఒకరు ప్రమాదాల్లో ప్రాణాలు వదిలారు అన్నారు. అనేక ప్రమాదకర మలుపులు ఉన్న ఎక్కడ ప్రమాద సూచి బోర్డులు ముందు జాగ్రత్త హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవటం ఆర్ అండ్ బి అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రమాదాలు జరుగుతున్న వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రమాద కారణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాద మరణాలపై విచారణ జరపాలని కోరారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకులు స్పందించకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. సీనియర్ నాయకులు మాల కుర్మయ్య ,చిన్న కురుమయ్య, చెన్నమ్మ ,కురుమమ్మ పాల్గొన్నారు.