విద్యుత్ శాఖ నుండి మంజూరైన పరిహారం చెక్కు అందజేత

విద్యుత్ శాఖ నుండి మంజూరైన పరిహారం చెక్కు అందజేత

ముద్ర,పానుగల్:-పానుగల్ మండలంలోని శాగాపూర్ గ్రామానికి చెందిన వంగూరి కుర్మయ్య కు చెందిన గేదె సంత్సరం క్రితం మజీద్ సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్  కు గురై మృతి చెందింది.గేదె మరణించిన విషయాన్ని బాధితుడు  గ్రామ స్థానిక ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ మౌనిక తిరుపతి యాదవ్,ఎంపీటీసీ సుబ్బయ్య యాదవ్ ల దృష్టికి తీసుకువెళ్లగా వారు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం చెక్కును మంజూరు చేయించారు.బాధితుడి కుర్మయ్య కు మంజూరు అయిన 40 వేల చెక్కును సర్పంచ్ మౌనిక తిరుపతి యాదవ్, ఎంపీటీసీ సుబ్బయ్య యాదవ్,మండల కోఆప్షన్ సభ్యులు హలీం పాషా లు అందజేశారు.కార్యక్రమంలో గ్రామ BRS  పార్టీ అధ్యక్షులు కానమోని తిరుపతయ్య,నాయకులు బద్దుల కొండలయ్య, కృష్ణయ్య, రవి, రాముడు, ఆడెం గంగయ్య, మేడం శివ, హరిజన కృష్ణయ్య, రఘు రాములు, జంపయ్యలు  పాల్గొన్నారు.