మంత్రి నిరంజన్ రెడ్డి కోలుకోవాలని ఆలయంలో పూజలు

మంత్రి నిరంజన్ రెడ్డి కోలుకోవాలని ఆలయంలో పూజలు

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని గట్టు కాని పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిఆర్ఎస్ నాయకులు పూజలు నిర్వహించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గత ఐదు నెలలుగా భుజం నొప్పితో బాధపడు తొండడంతో మూడు రోజుల క్రితం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో  భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని మంగళవారం గట్టు కాని పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,  మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి,  సింగిల్ విండో అధ్యక్షులు వెంకటేశ్వరరావు, రవి ప్రకాష్ రెడ్డి,  భార్గవి కోటేశ్వర్ రెడ్డి, గట్టు కాని పల్లి సర్పంచ్ దేవేంద్రం,  విక్రమ్,  సింగల్ విండో మాజీ అధ్యక్షులు బాల్రెడ్డి , రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.