మాటలు చెప్పే ప్రభుత్వం కాదు– ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు– ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం

ముద్ర.వీపనగండ్ల:-కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదని ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రభుత్వమని,అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి,ఎత్తం కృష్ణయ్య లు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులతో పాటు మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి, ఏత్తం కృష్ణయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని,ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు,మీ సేవలు, అధికారుల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్ లు తీసుకునే నూతన ఓరవడిని ప్రారంభించామని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు. రేషన్ కార్డు లేకపోయినా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతిపక్షం టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.ధనిక రాష్ట్రమైన తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.తొందర్లోనే ప్రతి రైతుకు రైతుబంధు డబ్బులు జమవుతాయని అన్నారు. కార్యక్రమానంతరం ముఖ్యమంత్రి గ్రామ సర్పంచ్ వంగూరు నర్సింహారెడ్డి చదివి వినిపించారు.కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప,ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో శేఖర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి నరేష్ గౌడ్,పానగల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, వైయస్ వెంకటయ్య, బసవరాజ్ గౌడ్, మహేష్ నాయుడు, గోపి తదితరులు ఉన్నారు.