ఒక వ్యక్తి కి కొల్లాపూర్ ఆత్మగౌరవానికి జరిగే యుద్ధం ఈ ఎన్నికలు

ఒక వ్యక్తి కి కొల్లాపూర్ ఆత్మగౌరవానికి జరిగే యుద్ధం ఈ ఎన్నికలు
  • 20 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి ఐదు సంవత్సరాలలో చేశాము
  • కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల: ఒక వ్యక్తి కి కొల్లాపూర్ ఆత్మగౌరవానికి జరిగే యుద్ధంమే ఈ ఎన్నికలు అని కొల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి, గోపల్దిన్నే,కాల్వరాల గ్రామలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో గడపగడపకి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను, గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్ రెడ్డి మండలంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు జననిరాజనాలు పలుకుతున్నారు,బీరం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మళ్లీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి అని కోరారు.గడిచిన 20 సంవత్సరాలుగా వీపనగండ్ల మండల కేంద్రంలో జరగనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాలలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని  మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాన్నాని, మరొక్కసారి అభివృద్ధికే పట్టం కట్టాలని బీరం కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని గోవర్ధనగిరి నుండి వీపనగండ్ల రోడ్డు పూర్తి చేసామని,కాల్వరాల లో 5 కోట్లతో కల్వరాల గ్రామం నుండి జమ్మాపూర్ వయా బుసిరెడ్డిపల్లి బీటి రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని,గోపాల్దిన్నె వంతెన పది లక్షల రూపాయలతో పూర్తి,10 లక్షలతో కల్వరాల నుండి వెలగొండ ఫార్మేషన్ రోడ్డు,కల్వరాల గ్రామంలో ఒక కోటి 60 లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్లు, సైడ్ డ్రయిన్లు అండర్ డ్రైనేజీలు నిర్మించామని అన్నారు.గ్రామంలోని హైస్కూల్ దగ్గర 20 లక్షలతో అండర్ డ్రైన్ పూర్తి చేసామని, స్కూల్ ల్యాబ్ 10 లక్షలతో పూర్తి చేసామని సొంతంగా మూడు లక్షలతో డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశాను అని అన్నారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడిన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిల రూపంలో 50 లక్షల రూపాయలు సహాయం అందించామని తెలిపారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో  శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటినుండి 10500 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామని కాల్వరాల గ్రామానికి 120 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామన్నారు.గత నాయకులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని నేను పనిచేసి ఓట్లు అడుగుతున్నాను అని అన్నారు.సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే..బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని,సిఎం.కేసీఆర్  పరిపాలనలో తెలంగాణ  రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.మరొక్కసారి బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తె మేనిఫెస్టోలొ చెప్పినట్టు అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా పెన్షన్లు దశలవారీగా రూ.5016 వరకు పెంపు, రైతుబంధు సాయం రూ.16,000వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ .3000 భృతి,400 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు,పేదలకు ఇళ్ల స్థలాలు.. మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అందుకే కారు గుర్తుకు ఓటు వేసి మరొమారు గెలిపించాలని ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు,డాక్టర్ కురువ విజయ్ కుమార్,కాటమోని తిరుపతమ్మ,ఎంపీపీ కమలేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత చిన్నంబావి మండల బిఆర్ఎస్ నాయకులు ధారా సింగ్, వీపనగండ్ల బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్,సర్పంచ్లు రఘునాథరెడ్డి, విజయ్ కుమార్, నాయకులు సురేష్ రెడ్డి, కిరణ్ గౌడ్, కృష్ణయ్య గౌడ్, రజాక్, సర్దార్ తదితరులు ఉన్నారు.