గ్రామ స్వరాజ్యం తో దేశం అభివృద్ధి చెందుతుంది - ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

గ్రామ స్వరాజ్యం తో దేశం అభివృద్ధి చెందుతుంది - ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
  • రూ.45 లక్షల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభం

ముద్ర.వనపర్తి:-గ్రామస్వరాజ్యం తో గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ది చెందుతుందని, గాంధీ చెప్పిన మాటలకూ అనుగుణంగా ప్రభుత్వం గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో జెడ్పి చైర్మన్ లొకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి,జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రూ.21 లక్షల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం,ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిర్మించిన  గ్రామ పంచాయతీ భవనం,రూ.24 లక్షల నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో నిర్మించిన నూతన ఆరోగ్య ఉప కేంద్రం ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మిగతా నాలుగు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.ప్రభుత్వ ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం ద్వారా వారి ఆర్థిక  భారం తగ్గించడంతో పాటు, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడంలో దోహాదపడుతుందన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరితా తిరుపతి, ఎంపీపీ రఘు ప్రసాద్, రెడ్డి,జెడ్పిటిసి సభ్యులు రఘుపతిరెడీ ఎంపీటీసీ సభ్యురాలు వరలక్ష్మి శేఖర్, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి వెల్టూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి చీకరు చెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ అమ్మపల్లి సర్పంచ్ రమేష్ యాదవ్, డిఅర్డిఓ నర్సింహులు,పంచాయతీ అధికారి సురేష్, డిప్యూటీ  డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, తాసిల్దార్ కిషన్ ఎంపీడీవో అఫ్జలుద్దీన్, నాయకులు వెంకటయ్య వెంకటేష్ మద్దిలేటి సురేష్ రాములు యాదవ్, మహేష్ రెడ్డి రాజ వర్ధన్ రెడ్డి, శివా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.