మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జూపల్లి

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జూపల్లి
  • జాతీయ రహదారిపై ఫిట్స్ వచ్చి పడిపోయిన బాధితుడిని హాస్పిటల్ కు తరలించిన మంత్రి

ముద్ర.వీపనగండ్ల:-వీపనగండ్ల మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తుండగా షాద్నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ గేట్ దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడంతో గమనించిన మంత్రి జూపల్లి గారు తన సహచరులతో కలిసి బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశారు.అనంతరం మంత్రి అంబులెన్సు కు ఫోన్ చేసి హాస్పిటల్ కు పంపించి వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులతో మాట్లాడారు.జాతీయ రహదారిపై ఇది గమనించిన ఇతర వాహనాల ప్రయాణికులు మంత్రి కృషికి హర్షం వ్యక్తం చేశారు.