క్రెడాయ్ ప్రాపర్టీ షోకు నగర వాసుల నుండి అద్భుతమైన స్పందన

క్రెడాయ్ ప్రాపర్టీ షోకు నగర వాసుల నుండి అద్భుతమైన స్పందన

 హైదరాబాద్ మహా నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉందని , పెట్టుబడుల వల్ల నగరం వృద్ది చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు వి రాజశేఖర్ రెడ్డి అన్నారు మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటుచేసిన క్రేడాయి ప్రాపర్టీ షో 2024 కార్యక్రమాన్ని రెండవ రోజు ఘనంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి ఆయన హాజరై పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరం అన్ని రకాల పెట్టుబడులకు అనువుగా ఉందన్నారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా  ఉన్నాయన్నారు. హైదరాబాద్ మార్కెట్ వాణిజ్య , రిటైల్ ప్రాపర్టీ పరంగా ఉత్తమ పనితీరును కనబరస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2050 నాటికి మెగా మాస్టర్ ప్లాన్ ప్రాతిపదిక మూసి కారిడార్ వంటి కార్యక్రమాలతో పాటు నగరానికి మెట్రో రైల్ విస్తరణ నగర ఉత్తర భాగాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో మహానగరంగా మారనుందన్నారు .మహా శివరాత్రి పర్వదినం రోజు ప్రారంభించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు నగరవాసుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు చివరి రోజైన ఆదివారం నాడు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.