రాబోయే 150 రోజులు కాంగ్రెస్​కు కీలకం: రేవంత్​ రెడ్డి

రాబోయే 150 రోజులు కాంగ్రెస్​కు కీలకం: రేవంత్​ రెడ్డి

గాంధీ భవన్​లో విస్తృతస్థాయి కార్యవర్గ భేటీ జరిగింది.  పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఎన్ని మెట్లయినా కిందికి దిగుతానని అన్నారు. వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. రాబోయే 150 రోజులు  మనకు కీలకమని అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు పోతానన్నారు. పార్టీని విజయపథంలో నడపడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్​కు 100 రోజుల కౌంట్​ డౌన్​ మొదలైందని అన్నారు. కేసీఆర్​తో చేతులు కలిపాకే కర్నాటకలో జేడీఎస్​ ఓట్లు తగ్గాయని చెప్పారు.

ఈసారి పేద, ధనిక ప్రజల మధ్య ఎన్నికలు జరుగుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​కు 88 సీట్లు వస్తాయని చెప్పారు. సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా కాంగ్రెస్​ అవతరిస్తుందని రేవంత్​ అన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్​ నేత అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ నేతలు పాలించేందకేనన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తారని చెప్పారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఆమె తిరుగుతారని తెలిపారు.