చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు

ముద్ర.వీపనగండ్ల:-అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లోని గ్రామపంచాయతీలలో 40 బూతులను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలను వేస్తున్నట్లు తెలిపారు, అంతేకాక ఏడు గ్రామాలకు ముఖ్య కూడలి అయిన ఉమ్మడి చిన్నంబాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రత్యేకంగా పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు, ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలాల్లో 5131 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయటానికి గుర్తించడం జరిగిందని,బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి మొబైల్ టీం ద్వారా వారు ఉండే ప్రాంతానికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని డాక్టర్ వంశీకృష్ణ వివరించారు. సోమ, మంగళవారాల్లో కూడా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులను గుర్తించి వారికి కూడా చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.