ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం  పోరాటం చేశా

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం  పోరాటం చేశా

ముద్ర. వీపనగండ్ల:ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం  పోరాటం చేశాను తప్ప అధికారం కోసం తాను ఏనాడు అమ్ముడు పోలేదని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.పల్లె పల్లెకు మన జూపల్లి కార్యక్రమంలో మండల పరిధిలోని తూముకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి  జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు విద్యుత్ బకాయిలపై పోరాటం చేశాను తప్ప చేతకాదు అని అమ్ముడు పోలేదు అని అన్నారు.

అధికారంలో కన్న ప్రతిపక్షంలోనే ఎక్కువ కాలం పని చేశానని, ఆనాడు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించడంలో తన పాత్ర ఎంతో ఉందని అన్నారు.తుంకుంట గ్రామంలో కాల్వల లో నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకుని రైతులకు న్యాయం చేయాలనే కనీసం ఆలోచన కూడా చేయలేని అసమర్థుడు బీరం అని విమర్శించారు.కే ఎల్ ఐ ద్వారా ఆయకట్టు పెంచి తుంకుంట గ్రామం వరకు సాగునీరు వచ్చేలా కృషి చేశానని,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ద్వారా ప్రజలకు జరగబోయే లబ్ధి గురించి వివరించారు. తుంకుంట గ్రామంలో ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గ్రామం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్,, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి,నాయకులు వాల మదన్మోహన్రావు, మౌలాలి, రఘునాథ్ రెడ్డి, పలుస రామన్ గౌడ్, సారంగం జయప్రకాష్, చిన్నరాంబాబు, మీసాల మోహన్, కృష్ణ పాల్గొన్నారు.