జాతీయస్థాయి డ్రాయింగ్ పోటీలకు చాణక్య పాఠశాల విద్యార్థిని ఎంపిక

జాతీయస్థాయి డ్రాయింగ్ పోటీలకు చాణక్య పాఠశాల విద్యార్థిని ఎంపిక

ముద్ర.వనపర్తి: జాతీయస్థాయి డ్రాయింగ్ పోటీలకు వనపర్తి చాణక్య పాఠశాల విద్యార్థిని అక్షర ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ సాజిపాల్ తెలిపారు.విద్యార్థిని అక్షర మండలస్థాయి, జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని మొదటి బహుమతి సాధించగా,పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష తెలంగాణ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ 2023 పోటీలలో పాల్గొన్నాది. ఈ పోటీలలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజువల్ ఆర్ట్స్ టుడే డ్రాయింగ్ కాంపిటీషన్లో వనపర్తి లోని చాణక్య హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎన్ అక్షర అత్యుత్తమ ప్రతిభ కనబరచి తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయికి ఎంపిక కావడం జరిగింది. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ సాజిపాల్ తెలిపారు.జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించబోయే ఎన్ అక్షర ను పాఠశాల ప్రిన్సిపల్ సాజిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించడం జరిగింది. జాతీయస్థాయిలో జరగబోయే పోటీల్లో కూడా తన అత్యుత్తమ ప్రతిభ చూపి పాఠశాలకు వనపర్తి జిల్లాకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.