వనపర్తి లో మంత్రి నిరంజన్ రెడ్డి పై మేఘారెడ్డి గెలుపు

వనపర్తి లో మంత్రి నిరంజన్ రెడ్డి పై మేఘారెడ్డి గెలుపు

 25322 ఓట్ల మెజార్టీ తో కాంగ్రెస్ ఘనవిజయం
 ముద్ర ప్రతినిధి, వనపర్తి:  వనపర్తి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో టిఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూడి మెగా రెడ్డి 2532 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. వనపర్తి ఓట్ల లెక్కింపులో మొత్తం 22 రౌండ్లలో లెక్కింపు జరగగా మొదటి రౌండ్లో 717 ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదిత్యం సాధించగా పోస్టల్ బ్యాలెట్ లతో సహా, 21 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తుడి మెగా రెడ్డి ఆదిక్యం వహిస్తూ వచ్చారు.

నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 13 వేల ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి తుడి మెగా రెడ్డికి 1,06,591 ఓట్లు రాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి 81, 269 ఓట్లు వచ్చాయి.  దీంతో తూ కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘారెడ్డి 25322 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించి అనంతరం ఎన్నికల పత్రాన్ని ఆయనకు అందజేశారు. మూడో స్థానంలో బిజెపి అభ్యర్థి అనుజ్ఞారెడ్డి రాగా మరో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.