నాగర్ కర్నూల్  బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్

నాగర్ కర్నూల్  బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్
  • ఎంపీ రాములు వ్యూహం  ఫలించింది
  • బిఆర్ఎస్ లో అవమానాలు భరించలేక... పార్టీ వీడిన ఎంపీ రాములు
  • ఎంపీ రాములుకు  పొమ్మనలేక పొగ పెట్టిన బిఆర్ఎస్ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  పార్లమెంట్ నియోజకవర్గ  బిజెపి అభ్యర్థిగా బిజెపి అధిష్టానం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఇటీవలనే ఢిల్లీలో మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్  ఎంపి అయినా పోతుగంటి రాములు ఆయన  కుమారుడైన కల్వకుర్తి  జడ్పిటిసి సభ్యుడు పోతుగంటి భరత్ ప్రసాద్ లు ఢిల్లీ  బిజెపి  పెద్దల సమక్షంలో చేరారు.  టికెట్  సిటింగ్ ఎంపీకి  ఇవ్వాలని అంగీకారంతోనే బిఆర్ఎస్ వదిలిపెట్టి బిజెపిలో   చేరడం జరిగింది  ఈ నేపథ్యంలోనే ఎంపీ రాములు కుమారుడైన భరత్ ప్రసాద్ కు నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ బిజెపి ప్రకటించడం జరిగింది.

బిజెపి లో చేరడానికి బిఆర్ఎస్ పార్టీని వీడడానికి పరిశీలిస్తే సిట్టింగ్ అయిన ఎంపీ  రాములుకు పలుసార్లు టిఆర్ఎస్ పార్టీలో అవమానం పరచడం ఇటీవల జరిగిన బిఆర్ఎస్ పార్ల మెంటు సన్నాహక సమావేశానికి ఆహ్వానించకపోవడం వల్ల మనస్థాపానికి  గురయ్యారు. అంతకుముందు కూడా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ తన కుమారుని ఎంపిక చేసి చివరి నిమిషంలో పేరు మార్చడంతో అప్పట్లో సంచలనం అయింది. అప్పటినుండి మనస్థాపానికి గురైన  ఎంపీ రాములు భరత్ ప్రసాదులు పార్టీలో తమకు గౌరవం లేదని తమ వ్యతిరేకులైన అచ్చంపేట శాసనసభ్యులకు బిఆర్ఎస్ అధిష్టానం అధిక ప్రాధాన్యతనిచ్చి వీరి మధ్య సమన్వయం లోపించడం వల్ల  అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  ముభావంగానే ఉంటూ వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భరత్ ప్రసాద్ భవిష్యత్తు కోసం రాజకీయ ప్రస్థానం కొనసాగించడానికి బిజెపిలో చేరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడంలో ఎంపీ రాములు సపలి కృతమయ్యారు.

ఎంపీ రాములు  గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నుండి  మూడుసార్లు శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా కొనసాగుతూ పార్టీలకతీతంగా మంచి పేరు తెచ్చుకున్నారు. సౌమ్యడుగా మంచి వ్యక్తిగా గుర్తింపు ఉమ్మడి జిల్లాలో ఉన్నది. నాగర్ కర్నూల్ పార్లమెంటు వ్యాప్తంగా  రాములుకు మంచి సంబంధాలు పార్టీలకతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తన వయసు రిత్యా తన కుమారుని రాజకీయ వారసునిగా గతంలోనే కల్వకుర్తి జెడ్పిటిసిగా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం భారత్ ప్రసాద్ కల్వకుర్తి మండల జెడ్పిటిసిగా కొనసాగుతున్నారు. బిజెపి అభ్యర్థిగా విద్యావంతుడు భరత్ ప్రసాద్ వ్యూహంలో భాగంగానే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. భరత్ ప్రసాద్  ఇంజనీరింగ్ ఎంసీఏ ఎల్ఎల్ బి ఉన్నత విద్యలను  అభ్యసించాడు. భరత్ ప్రసాద్ కు రాజకీయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. వివిధ అంశాలపై కూడా అవగాహన కలిగి సమర్థవంతంగా పార్లమెంటులో తన గలాన్ని ఇప్పే సామర్థ్యం  గలవాడు.