బీరుతో హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు)

బీరుతో హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు)

ముద్ర ప్రతినిధి :నాగర్ కర్నూల్ జిల్లా తాడుర్ మండలం ఐతోల్ గ్రామంలో నిర్వహించిన వివాహ వేడుక వివాదాస్పదమవుతుంది. అత్యంత పవిత్రంగా గౌరవప్రదంగా జరగాల్సిన పెళ్లి తంతు బీరుతో హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు) నిర్వహించడంతో వివాదాలకు దారితీస్తోంది.

వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదిక అయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం నెటిజన్ల నుండి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.