ప్రోటోకాల్ ను విస్మరించిన డీఈఓ...

ప్రోటోకాల్ ను విస్మరించిన డీఈఓ...
  • ఎమ్మెల్యేను ఆహ్వానించి అవమానపరిచారటు డిఈఓ ని నిలదీసిన కాంగ్రెస్ శ్రేణులు...
  • ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రాకముందే స్కూల్ ప్రారంభించి వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో డీఈఓ గోవిందు రాజులు ప్రోటోకాల్ పాటించకుండా తమను పిలిచి అవమానించారంటూ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ధ్వజమెత్తారు.. దీంతో కాంగ్రెస్ నేతలు జిల్లా విద్యాశాఖ అధికారిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రికత వాతావరణం చోటుచేసుకుంది.

నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్స వాడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ట్రస్టు ద్వారా సిర్స వాడ  గ్రామంలో ఉన్నత పాఠశాలలో నిర్మించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.. పాఠశాల భవనం పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి అప్ప చెప్పాల్సిన వుండ గ ఆదివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.. కానీ తాను హాజరయ్యే సమయానికి ముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేత పాఠశాల ప్రారంభించాడని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.. పాఠశాల భవనానికి టిఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో ఆయన వర్గం కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు అంత DEO గోవిందు ను ప్రశ్నించారు... దీంతోదీంతో ఆ గ్రామంలో తీవ్ర గందరగోళం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.. తనను ప్రారంభోత్సవానికి పిలిచి అవమానించారంటూ డిఈఓపై శాఖ పర్యమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ను ఎమ్మెల్యే కోరారు...