కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రంగినేని అభిలాష్ రావు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రంగినేని అభిలాష్ రావు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:- కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించారు.18 నెలల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అభిలాష్ రావు వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి  అభిలాష్ రావు చేస్తున్న సేవలను గుర్తించి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరికను అభిలాష్ రావు స్వాగతించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలసి అభిలాష రావు  పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.అయితే గత నెల రోజులుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓంటెద్దు పోకోడలు సహించని  అభిలాష్ రావు రాజకీయ పరిస్థితుల దృశ్య్చ  ప్రాంత భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇటీవలే అభిలాష్ రావు చిన్నంబావిలోని తన ఆడిటోరియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి,జూపల్లి కృష్ణారావు వ్యవహార శైలిపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

28న బిఆర్ఎస్ పార్టీలో చేరిక?

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసిన అభిలాష్ రావు ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం!