జూపల్లి నిర్ణయం పై ఉత్కంఠ..

జూపల్లి నిర్ణయం పై ఉత్కంఠ..

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల తో సహా ఉమ్మడి పాలమూరు జిల్లా లో జూపల్లి కృష్ణారావు కార్యచరణ పై ఆసక్తి నెలకొంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది అనే అంశంపై సర్వత్ర చర్చ జరుగుతుంది ఇతర నేతలతో కలిసి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తారా లేదంటే కాంగ్రెస్ భాజపాక కండవాలు కప్పు కోనున్నారా అనే అంశంపై  ముఖ్య అనుచరులతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లా లోని రాజకీయ నేతలంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు జూపల్లి కృష్ణారావు పూర్వ మహబూబ్ నగర్ తో సహా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన సీనియర్ రాజకీయ నాయకుడు. బిఆర్ఎస్ ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి అడుగులు ఎటువైపు అనే అంశంపై సర్వత్ర చర్చనీయాంశమౌతుంది జూపల్లి కృష్ణారావు బ్యాంకు ఉద్యోగికి రాజీనామా చేసి 1999 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జూపల్లి కృష్ణారావు అదే సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం 2004,2009,2012,2014, ఎన్నికల్లోను ఎమ్మెల్యేగా పోటీ చేసి వోరుసగ ఐదుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శాసన సభ్యుడిగా రికార్డు సాధించారు. 1999,2009 కాంగ్రెస్ ,2004 లో స్వతంత్ర అభ్యర్థిగా 2012 ఉప ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలుపు వైయస్సార్ మంత్రివర్గంలో జూపల్లి పౌరసరఫరాల శాఖ మంత్రిగ, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా, కెసిఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసినందున ఉమ్మడి  పాలమూరు జిల్లాలో ఆయనకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అనుచర వర్గం ఉంది 2018లో కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో హర్షవర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. తెరాసలో జూపల్లి ప్రభల్యం తగ్గడంతో బిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ కు దారితీసింది.

జూపల్లి నీ బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో మహబూబ్నగర్ జిల్లాలో ఆయనతో కలిసేది ఎవరనేది  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జూపల్లికి నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాలో గట్టిపట్టు ఉండడంతో ఈ నియోజకవర్గంలో పలువురు స్థానిక  ప్రతినిధులతో ఆయన అనుచరులు జూపల్లి వెంట నడిచే అవకాశం ఉంది. తొలి నుంచి నిరంజన్ రెడ్డికి జూపల్లికి మధ్య అభిప్రాయ విభేదాలు ఉన్నాయి ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి  పై వనపర్తి ఇలాక లో జడ్పీ చైర్మన్, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, తిరుగు బహుట  ఎగురవేశారు అసమ్మతినేతలు ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరలేదు వారిలో కొందరు జూపల్లి వెంట ఉంటారని ప్రచారం జరుగుతుంది నాగర్ కర్నూల్ జిల్లా లో బిఆర్ఎస్ ముఖ్య నేతలలో అసమతి రాగం వినిపిస్తుంది ప్రస్తుతం బయటపడకున్న జూపల్లి వీళ్ళందర్నీ కలుపుకొని పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో తన ముద్ర ఉమ్మడి జిల్లా పై ఉండాలని ప్రణాళికతో జూపల్లి పావులు కదుపుతున్నారని తెలుస్తుంది ప్రధానంగా కొల్లాపూర్ నియోజక వర్గంలో తన గెలుపుకు అవకాశాలు ఉండే రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రణాళిక ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల మరో ఆరు నెలల్లో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రాజకీయ వేడి ప్రారంభమైంది ఇంకా జూపల్లి కొత్త పార్టీ పెడతారా లేదా రాష్ట్రములో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ,బిజెపి పార్టీలో చేరుతారని అంశంపై జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అధికార పార్టీపై చాలాసార్లు దాడికి దిగిన జూపల్లి ఏ పార్టీలో వెళ్తారు అనే అంశంపై చిన్న సంకేతం కూడా వదల్లేదు. కార్యకర్తలు అభిమానులు ఏం నిర్ణయిస్తే నేను ఆ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొస్తూ వస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో  పార్టీ మార్పు పైన కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని చెప్పుకొస్తున్నారు జూపల్లి కృష్ణారావు..