క్షుద్ర పూజల కలకలమలో నాగర్ కర్నూల్ కౌన్సిలర్ పాత్ర...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన క్షుద్ర పూజల కలకలంలో ఇరువురిని అరెస్టు చేసినట్లు ఒక కౌన్సిలర్ పరారీలో ఉన్నారని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఈనెల 25న రాత్రి బస్టాండ్ సమీపంలో  ఒక పూల షాపు ఎదుట మరియు పర్నిచర్ షాప్ ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను వదిలి వెళ్ళినట్లు గుర్తించిన యజమానులు ఫిర్యాదు చేయడంతో కేసులు విచారించి లింగాల మండల కేంద్రానికి చెందిన ఇనామల్ నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన మోహిన్ లను అరెస్టు చేయడం జరిగిందని వీరిని విచారించగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ సలహా మేరకు పూజలు నిర్వహించినట్లు పేర్కొనడంతో ముగ్గురిపై కేసులు నమోదు చేయడం జరిగిందని కౌన్సిలర్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని కోరారు.