అక్రమ నల్లమట్టి దందా లో , నల్లమట్టి మురికి పోవడానికా పాలాభిషేకం..?

అక్రమ నల్లమట్టి దందా లో , నల్లమట్టి మురికి పోవడానికా పాలాభిషేకం..?
  • ఎమ్మెల్యే మర్రికి మరో పెళ్లిపై అంత ఇష్టం ఉంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో  పెళ్ళిలలో, పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా ప్రజలను అడగటం దేనికి..?  బిఎస్పీ.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21రోజుల సంబరాల పేరుతో, రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేప్పట్టారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ 10ఏళ్ల పాలనలో ఏం సాధించారని, ప్రజాధనం వృథా చేస్తూ ఊరూరా సంబరాలు నిర్వహిస్తున్నారని మండి పడ్డారు. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే మర్రికి పెళ్లిపై అంత సోకు ఉంటే, గతంలో తన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెళ్లిళ్లలో పెళ్లి చేసుకుంటే, నేడు ప్రజలను అడిగే పరిస్తితి వచ్చేది కాదని విమర్శించారు. ముత్యాలను ఎవ్వరూ కడగరనీ, తెలివి ఉన్న వాళ్ళు ఐతే కడిగిన ముత్యాలు అనీ ప్రచారం చేసుకోరని ఎద్దేవా చేశారు.

అక్రమ నల్లమట్టి దందా చేస్తున్నందుకు, నల్లమట్టి మురికి పోవడానికా పాలాభిషేకం అనీ ప్రశ్నించ్చారు. మర్రి-దామోదర్-నాగం ముగ్గురు ఒక్కటే అనీ చెప్పారు. ఇ ముగ్గురి కుట్రలను పేద ప్రజలు పసిగట్టి, రానున్న ఎన్నికల్లో ఇ ముగ్గురికి సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. అట్లాగే జిల్లా అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, బీసీ బంధు-గిరిజన బంధు ఇవ్వకుండా, ఇట్లా తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీనీ రానున్న ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టాలనీ పిలుపు నిచ్చారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంఛార్జ్ లు అంతటి నాగన్న, బిసమొల్ల యోసేఫ్, జిల్లా నాయకులు బోనాసి రాంచందర్, కొయ్యల శ్రీను, గగనం శేఖరయ్య, ఎ.ఆంజనేయులు, కృష్ణయ్య, నరసింహ, మోహన్ రెడ్డి, అసెంబ్లీ కమిటీల నాయకులు మోత్కూరి నాగార్జున, పృథ్వీరాజ్, బండగల్ల చందు, ప్రకాష్, మహేష్ యాదవ్, ఆనంద్, మడుపు నాగేష్, పరుష రాములు, కళ్యాణ్, లక్ష్మణ్, రాంచందర్, శివ శంకర్, శివ కృష్ణ, రాజు, నాగరాజు, మబ్బు రాము, బాలకృష్ణ, చంద్రబాబు, మల్లేష్, భాస్కర్, రాజేష్ లు పాల్గొన్నారు.