కేంద్ర రైతు పథకాలపై చైతన్యం చేయాలి. 

కేంద్ర రైతు పథకాలపై చైతన్యం చేయాలి. 

రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మనెమ్మ నగేష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలపై వ్యవసాయ అధికారులు మరియు విత్తన దుకాణదారులు రైతులను చైతన్యం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మణెమ్మ నగేష్ కోరారు గురువారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రారంభించిన వివిధ ఒక పథకాలు ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను రాజులుగా మార్చేందుకు యూరియా పై 2236 రూపాయలను డి ఏపిపై 2422 సబ్సిడీలు ఇవ్వడం జరిగిందని ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలనే కోరారు. రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో 5000 రూపాయలు చెల్లించి రైతులకు అందవలసిన కేంద్ర ప్రభుత్వ నిధులను అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులందరికీ సమన్యాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కిసాన్ సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేయడం  జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల ఉత్పత్తుల పెంచేందుకు భూసార పరీక్షలతో పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కొండా నగేష్ పట్టణ అధ్యక్షుడు సైదులు ప్రధాన కార్యదర్శి ప్రమోద్ రూరల్ ప్రధాన కార్యదర్శి బాల మల్లయ్య జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి జిల్లా పూర్తిస్థాయి కార్యకర్త శరత్ నాగనులు శక్తి కేంద్రం ఇన్చార్జి చందు భూత్ అధ్యక్షులు కృష్ణ పరిషరామ్ ఇంద్రసేనారెడ్డి పవన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాము ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.