నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు...

నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు...

ఇద్దరు మైనర్ బాలికలు ..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు భాగ్యమ్మ (16) హైమావతి (13).నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. తమ పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చారు కానీ పిల్లల ఆచూకీ లభ్యం కాలేదు. నాలుగు నెలల తర్వాత పిల్లలు భువనగిరిలో ప్రత్యక్షమయ్యారని పోలీసులకు వచ్చిన సమాచారంతో ఆ పిల్లలని తెలకపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు బాలికల కథనం ప్రకారం ఆగస్టు 24వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయామని నాగర్ కర్నూల్ లో చిరు వ్యాపారులు పరిచయమయ్యారని రాత్రి వాళ్ళతో బస చేసి వాళ్ల వెంటనే హైదరాబాద్ చౌటుప్పల్ కి వెళ్ళామని వాళ్లతో పాటు మూడు నెలలు బొమ్మలు విక్రయిస్తూ గుడిసెలోనే గరిపామని అన్నారు.


ఆ తర్వాత ఎలక్షన్స్ మొదలు కావడంతో ఆ వ్యాపారులు గుడిసె కాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నామని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పడంతో తిరిగి ఒక ఆటో అతని సహకారంతో మరొక ప్రాంతానికి వెళ్లి కూలి పనులు చేసుకున్నారు.. అక్కడ కొంతమంది పిల్లలని స్కూల్లో చదివించాలని నిర్ణయం తీసుకుని ఒక పాఠశాల కు తీసుకెళ్లగా అక్కడ ప్రధానోపాధ్యాయుడు వివరాలు తెలుసుకునే క్రమంలో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలియడం జరిగింది ....ఆ తరువాత తెలకపల్లి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో ఎస్సై వస్రం నాయక్ పోలీసు సిబ్బందిని పంపించి పిల్లలని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పిల్లల తండ్రి నాగరాజు మాట్లాడుతూ మా పిల్లలు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని కానీ నాలుగు నెలలు మా పిల్లలు ఎవరితో ఉన్నారు, ఆ వివరాలు కూడా పోలీస్ శాఖ వాళ్ళు సేకరించి నిజంగానే మా పిల్లలు వెళ్లారా ఎవరైనా అపహరించారా అనే కోణంలో దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని కోరారు.