జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 13వ సామాజిక పనికి కార్యక్రమం....

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 13వ సామాజిక పనికి కార్యక్రమం....

తుర్కపల్లి (ముద్ర న్యూస్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పారదర్శకంగా నిర్వహించుకోవడంలో భాగంగా నిర్వహించే సామాజిక తనిఖీ కార్యక్రమాలను శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో 13వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి మండలంలోని 31 గ్రామాలలో డిసెంబర్ 2 నుండి 15వ తేదీ వరకు సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. డిసెంబర్ 1 2001 నుండి మార్చి 31 2023 వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ పనులలో కూలీలకు చెల్లించిన.45309294 వేతనాల చెల్లింపు. పనిముట్ల సామాగ్రి కొరకు 11256018 రూపాయలను ఖర్చు ఖర్చు చేయగా మొత్తం 56565313 రూపాయలను వెచ్చించినట్లు వివరించారు. సామాజిక తనిఖీలు మొత్తం 9863 రూపాయలను రికవరీ చేశామని చెప్పారు. ఏపీఓకు 1000. ఈసీకి డిఏలకు 5145. సీఈఓ కు 744 పంచాయతీ కార్యదర్శుల నుండి 442 రూపాయలను రికవరీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడి శ్యామల.

ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్. ఎంపీడీవో ఉమాదేవి. ఎపిఓ వెంకటేశ్వర్లు. అసిస్టెంట్ విజిలెన్స్ పర్సన్ వీరమల్లు. ఎస్ టి ఎం అంజాద్. ఎస్ఆర్సి బద్రు నాయక్. ఏపీవో నరసయ్య. ఈసీ యశోద. టీఏలు చంద్రశేఖర్. జ్యోతి. భాస్కర్ నాయక్. శిరీష. మాధవి. జీవోలు శ్రీలత. ప్రసాద్ తో పాటు పంచాయతీ కార్యదర్శులు. ఫీల్డ్ అసిస్టెంట్లు. కార్యాలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.