నేడే శ్రీ నలవీర గంగాభవాని రాత్రి తిరుణాల...

నేడే శ్రీ నలవీర గంగాభవాని రాత్రి తిరుణాల...
  •  బుధవారం పగలు తిరుణాలకు భారీ ఏర్పాట్లు.... 
  • సిటిఎం సర్పంచ్ ఆనంద పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు...
  •  ఎంపీపీ రెడ్డమ్మ వెలుగు చంద్ర, సర్పంచ్,  గ్రామ పెద్దలతో కలిసి సీఐ ఏర్పాట్లు పరిశీలన...

ఎంతో ప్రతిష్టాత్మకంగా, చాలా గొప్పగా భావించే   సిటిఎం(చిన్నతిప్పసముద్రం )శ్రీ నలవీర గంగాభవాని జాతర ఆదివారం రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రవేశంతో జాతర ప్రారంభమైంది.  సోమవారం ఉదయం సిద్దుల భుక్తి - అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పలు గ్రామాల నుండి మహిళలు బోనాలతో నలవీర గంగాభవాని ఆలయంకు వచ్చి పూజలు చేపట్టారు. నేడు మంగళవారం  సిళ్ళు - రాత్రి తిరుణాల, అమ్మవారి ఊరేగింపును వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి తిరణాలకు లక్షలాదిమంది భక్తులు జాతర జరుపుకునే గ్రామాలు నుంచే కాకుండా దూర ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల నుండి విచ్చేస్తారు. గ్రామాల నుండి ఎంతో ఆకర్షణీయంగా తయారీ చేసిన చాందిని బండ్లు సిటిఎంలోని నల వీర గంగాభవాని ఆలయంకు ఊరేగింపుగా మేళ తాళాలు, బళ్లారి డ్రమ్స్, బాణాసంచా పేలుళ్ల మధ్య   తీసుకొచ్చి సందడి చేయనున్నారు. 8న బుధవారం పగలు తిరుణాల - కల్లిపాటు - అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.

 సర్పంచ్, ఎంపీపీ,గ్రామ పెద్దలతో సిఐ సత్యనారాయణ జాతర ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహణ...

జిల్లాలోనే తొలి గంగజాతర కావడం వల్ల  భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్ తో కలిసి  జాతర ఏర్పాట్లు, బందోబస్తు విషయమై సర్పంచ్ ఆనంద పార్థసారథి, ఎంపీపీ రెడ్డమ్మ వెలుగు చంద్ర, సింగిల్ విండో  వైస్ చైర్మన్ పొగాకు వీర ప్రతాప్, గ్రామ పెద్దలతో  చర్చలు జరిపారు. ఆలయం పక్కనే రైల్వే లైన్ ఉండటంవల్ల ప్రమాదల జరగకుండా ముందుస్తూ చర్యలు చేపట్టారు. రైల్వే ట్రాక్ లోకి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. లక్షలాదిమంది భక్తులు వస్తున్నడంతో  భారీ స్థాయిలో పోలీసులచే బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేశారు.

 విద్యుత్ దీపాలతో ఆలయ అలంకరణ..

ఆలయాన్ని విద్యుత్ దీపాలతో  సుందరంగా అలంకరణ చేశారు. ఆలయం మొత్తం పచ్చటి అరిటాకులు, మామిడి తోరణాలతో అలంకరించారు. సిటిఎంకు ఇరువైపులతో పాటు ఆలయ ప్రాంగణంలో చిల్లర దుకాణాలు ఏర్పాటుచేసి పలు రకాల  తినుబండారాలను అందుబాటులోకి ఉంచారు. చిన్నపిల్లల సరదా కోసం  జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, రంగులరాట్నం వంటి పరికరాలను ఏర్పాటు చేశారు.

నేడు రాత్రి, పగలు తిరణాలలో  జంతుబలి ఇచ్చి మెక్కులు తీసుకోనున్న భక్తులు..

 గంగ జాతర కావడంతో జాతర జరుపుకోనున్న సీటీఎం, సిటిఎం క్రాస్, కొత్తవారిపల్లి, దుబ్బిగానిపల్లి పోతుబోలు పంచాయితీ   గ్రామాలతో పాటు కురబలకోట, వాల్మీకిపురం మండలాల్లోని జాతర జరుపుకునే  ఇంట బంధువులు, స్నేహితులతో సందడి నెలకొంది. ప్రతి ఇంటిలోనూ వారి స్తోమతకు తగినవిదంగా పది రకాల శాకాహార, మాంసాహార వంటలను వండుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా జాతర జరుపుకునే వారు శ్రీ నలవీర గంగాభవాని ఆలయం ముందు కోళ్లు, గొర్రె పొట్టేలు నరికి మొక్కులు తీర్చుకోనున్నారు. గ్రామాల నుండి గొర్రె పొట్టేలును ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం ముందు  బలి ఇవ్వనున్నారు. మహిళలు దీలు బోనాలు మోసి  అమ్మవారి ఆలయంలో వారి మొక్కులు చెల్లించుకోనున్నారు.

 9న జిల్లాలోని అతిపెద్ద ఎద్దుల పరుష నిర్వహణ...

 జిల్లాలోని అతి పెద్ద ఎద్దుల పరుష ఈనెల తొమ్మిదిన జరగనున్నది. ఈ ఎద్దుల పరుషకు వందలాది ఎద్దులు, గేదెలు, పాడి ఆవులు,లేగ దూడలను సైతం రైతులు తీసుకురానున్నారు. ఈ పరుషలోనే ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే వ్యవసాయ పనులు కోసం  రైతులు ఎద్దులను కొనుగోలు చేస్తారు. శేషాద్రి రమణమ్మ జ్ఞాపకార్థం  వీరి కుమారుడు శేషాద్రి నాగేంద్ర ఈ ఎద్దుల పరుషను నిర్వహించనున్నారు.రెండు రోజులపాటు  ఈ పరుష జరగనున్నది.

 సర్పంచ్ ఆనంద పార్థసారథి ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు....

 జిల్లాలోనే తొలి గంగజాతరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సిటిఎం శ్రీ నలవీర గంగాభవాని  జాతరను  అత్యంత వైభవంగా నిర్వహించేలా  సర్పంచ్,  చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు, రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ కార్పొరేషన్  డైరెక్టర్ ఆనంద పార్థసారథి ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు చేశారు. సుమారు వారం రోజులపాటు  జరిగే ఈ జాతరను ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మందికి పైగా ఈ జాతరకు జనం విచ్చేయనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  కావాల్సిన ఏర్పాట్లను  ఎంపీపీ రెడ్డమ్మ వెలుగు చంద్ర,  సర్పంచ్ లు పి మహేష్ బాబు, బుడ్డయ్య, బండపల్లి ఈశ్వరమ్మ,  గ్రామ పెద్దలు సురేంద్ర రెడ్డి, పొగాకు వీర ప్రతాప్, ఆలయ పూజారి మురళీధర్ లతో కలిసి గంగ జాతరను విజయవంతం చేసేందుకు సర్పంచ్ ఆనంద పార్థసారథి కృషి చేశారు.