ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యం అద్భుతం

ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యం అద్భుతం

భూదాన్ పోచంపల్లి, ముద్ర: ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యం అద్భుతమని యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మార్కండేశ్వర స్వామి దేవాలయంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 6, 7, 8 వ తేదీలలో ఎల్బీనగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగే ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలని కోరారు. ఆధునిక టెక్నాలజీతో ఫోటోగ్రాఫర్లకు ఎంతో నష్టం జరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫోటోగ్రాఫర్లకు  ప్రభుత్వం చేయూతనివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భోగ చంద్రశేఖర్, మండల గౌరవ అధ్యక్షులు దోర్నాల గణేష్, అధ్యక్షులు గుద్దేటి పాండు, ఉపాధ్యక్షులు రచ్చ సుధాకర్, ప్రధాన కార్యదర్శి కేమ విష్ణు, కోశాధికారి చెక్క శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్లు దొడ్డమోని వంశీధర్ ,చెక్క మల్లేష్, ఎర్ర విగ్నేష్, సీత శ్రవణ్, గోదాసు సతీష్, నవీన్, రత్నం, చెక్క రమేష్, చెక్క వెంకటేష్, బాల లింగం, వేంకటాచారి,సంతోష్ ,నాగేష్, కృష్ణ ,ఉమాకాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.