ముదిరాజుల రిజర్వేషన్లను త్వరగా తేల్చాలి....

ముదిరాజుల రిజర్వేషన్లను త్వరగా తేల్చాలి....

ఆలేరు (ముద్ర న్యూస్):ముదిరాజ్ లను బిసి డి నుండి బిసి ఏలోకి చేర్చాలని అనేక సంవత్సరాలుగా ముదిరాజ్ లు పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ముదిరాజ్ కులానికి చెందిన యువతి యువకులు తీవ్రంగా నష్ట పోవుచున్నారు అని తెలంగాణ ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గుర్రాల బాలకృష్ణ అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ముదిరాజ్ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజులను బిసి డి లో ఉంచడం వలన భవిష్యత్తులో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.