ఆలేరులో బిజెపి గెలుపు ఖాయం.. జాతీయ నాయకులు వీరరాజు ఆశాభావం..

ఆలేరులో బిజెపి గెలుపు ఖాయం.. జాతీయ నాయకులు వీరరాజు ఆశాభావం..

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు శాసనసభ స్థానానికి బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పడాల శ్రీనివాస్ విజయం ఖాయమని బిజెపి జాతీయ నాయకులు సోము వీర రాజు ఆషాభావం వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని కమలమ్మ జనార్ధన్ గార్డెన్లో బిజెపి అభ్యర్థి పడాల శ్రీనివాస్ విజయం కోసం నిర్వహించిన సమావేశానికి ఆయన, ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి మధుకర్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాస్త్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. లక్ష కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన అనైతిక చర్యలు, అసమర్ధ విధానాలు, అవగాహన లోపల నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాల సహాయ చర్యలు అందించినప్పటికీ నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటిగా మారిందని అన్నారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వలన దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అభ్యర్థి పడాల శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గ బిజెపి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.