అభివృద్ధి, సంక్షేమ ఫలాలే బిఆరెస్ గెలుపునకు నాంది : పోచారం భాస్కర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్

అభివృద్ధి, సంక్షేమ ఫలాలే బిఆరెస్ గెలుపునకు నాంది : పోచారం భాస్కర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్

బాన్సువాడ, ముద్ర: తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ ఫలాలే ఎన్నికల్లో గెలుపునకు నాంది పలుకుతాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఈరోజు నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో  BRS పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  BRS పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి  చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 

తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎట్లా ఉండేనో, ఇప్పుడు ఎలా మార్పు చెందాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరధ ద్వారా తాగునీరు వస్తుందని, 24 గంటల కరంటు సరఫరా అవుతుంది. గల్లిగల్లికి సిసీ రోడ్లు వేయించారని అన్నారు.

వృద్దులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు వస్తున్నాయని, కేసీఆర్  ప్రకటించిన కొత్త మేనిఫెస్టో ప్రకారం పెన్షన్ 5016 రూపాయలు వస్తాయని అన్నారు.

పోచారం శ్రీనివాసరెడ్డి  గత పదేళ్లుగా రైతులను కంటికి రెప్ప లాగ కాపాడుతున్నారని, నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించి, చివరి ఎకరాకు కూడా నీళ్ళు అందిస్తున్నారని, గత పదేళ్ళలో ఏటా రెండు పంటలు పండించుకున్నామని అన్నారు.

రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ అందుతాయని,. రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని అన్నారు.

భవిష్యత్తు లో మన ఊర్లు ఇంకా బాగుపడాలంటే మనమందరం కారు గుర్తుపై ఓటు వేసి పోచారం శ్రీనివాస రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 నసురుల్లాబాద్ BRS పార్టీ మండల అధ్యక్షులు పెరక శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కో ఆప్షన్ మజీద్,ఎంపీపీ పాల్త్యా విఠల్ మరియు మండల నాయకులు,ప్రజా ప్రతినిదులు, నెమ్లి గ్రామ నాయకులు భూమేష్, హాన్మండ్లు,బొబ్బిలి గంగారాం మరియు కార్యకర్తలు ఈ ఇంటింటి ప్రచారంలో పోచారం భాస్కర్ రెడ్డితో పాల్గొన్నారు