కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను..... ఓడించేందుకే వచ్చా : రేవంత్ రెడ్డి

కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను..... ఓడించేందుకే వచ్చా : రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిది, కామారెడ్డి : మా అమ్మ గ్రామం కొనాపూర్ అని, అందుకే కామారెడ్డి నుంచి పోటి చేస్తున్న అంటున్న కేసీఆర్, ఇక్కడి భూములను దోచునేందుకే వస్తున్నాడని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బి మంగళవారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, దోమకొండ మండలాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి కి చెందిన బీరయ్య అనే రైతు చనిపోతే కేసీఆర్ పరమర్శించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలు అయ్యారని, ఆత్మహత్య లు చేసుకున్నారని అన్నారు. కామారెడ్డి చుట్టుపక్కల భూములు దోచుకొనేందుకే మాస్టర్ ప్లాన్ వేశారని, ప్రస్తుతం మళ్ళీ భూములు దోచుకొనేందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటి చేస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ను ఓడించేందుకే నేను కొడంగల్ నుంచి కామారెడ్డి వచ్చనన్నారు.  కేసీఆర్ కామారెడ్డి భూములను కబ్జా చేసేందుకు వస్తున్నాడని షబ్బీర్ అలీ సోనియా గాంధీకి చెబితేనే, కేసీఆర్ ను ఓడించెందుకే ఇక్కడికి వచ్చాననన్నారు. షబ్బీర్ అలీ హయాంలో కామారెడ్డి అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఉద్యోగాలు చేస్తున్నారని, వారి  ఉద్యోగం ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పింఛన్లు రూ.4వేలు ఇస్తామని, సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని, రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని అన్నారు. భూమి లేని పేదలకు ఉపాధి హామీ కింద రూ.12 వేలు ఇస్తామన్నారు.  కేసీఆర్ తాడ్వాయి గుట్ట మీద తాడు బట్టి భూములు గుంజుకున్నారని అన్నారు. కేసీఆర్ వస్తే భూములు, ఉద్యోగాలు, విద్యుత్తు పోతుందన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కాలు పెట్టకుండా చేస్తామన్నారు.  రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పనులన్నీ జరుగుతాయన్నారు. మాజీమంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు.