నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో  OTS స్కీమ్ అమలు : పోచారం భాస్కర్ రెడ్డి        

నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో  OTS స్కీమ్ అమలు : పోచారం భాస్కర్ రెడ్డి        

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:   నిజామాబాద్ సహకార బ్యాంకులో మరోసారి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సొసైటీ చైర్మన్లు, బ్యాంకు లో లోన్లు తీసుకున్న రైతుల అభ్యర్థన మేరకు  OTS( ఏక కాల పరిష్కారం) స్కీమ్    మే 1 నుండి జూన్ 30 వరకు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

మార్చి 31  వరకు కాల పరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేయబడి సొసైటీ ల ద్వారా తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాఫీ, వాయిదా మీరిన వడ్డీ పైన 30%మాఫీ చేయబడుతుందని తెలిపారు. మార్చి 31 వరకు కాలపరిమితి ముగిసిన బ్యాంకు ద్వారా తీసుకున్న ఎన్ ఎఫ్ ఎస్, మార్టిగేజ్, ఎల్టీ లోన్లు, జేఎల్జీ, ఎస్ హెచ్ జి రుణాలపై వడ్డీ 32% మాఫీ చేయబడుతుందని తెలిపారు.

అర్హులైన  రుణ గ్రస్తులు అందరు OTS స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖచ్చితమైన వివరాల కోసం సంబధిత సొసైటీ లను,బ్రాంచ్ మేనేజర్ లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు.