ఏనుగు లాగ వచ్చాడు.. పీనుగు లాగ వెనక్కి పంపాలి

ఏనుగు లాగ వచ్చాడు.. పీనుగు లాగ వెనక్కి పంపాలి
  • ఎల్లారెడ్డి లో ఓడిపోయి దిక్కు లేక బాన్సువాడకు  వచ్చావ్
  • కాంగ్రెస్ అభ్యర్ధిపై పోచారం భాస్కర్ రెడ్డి ఫైర్

బాన్సువాడ, ముద్ర: ఏనుగు లాగా వచ్చిండు... మన బాన్సువాడ తడాఖా చూపించి పీనుగ లాగా వెనక్కి పంపించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.   బాన్సువాడ పట్టణంలో యువకుల ఆత్మీయ సమ్మేళనం తో పాటు పలు వార్డుల్లో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి  మాట్లాడారు.  ఈ 15 రోజులు కష్టపడితే తరువాత  5 ఏండ్లు బాగుంటాయని,
పక్క నియోజకవర్గం నుండి రాబందులు వచ్చాయని అన్నారు. మనమందరం సమన్వయంతో ముందుకు సాగితే రాబందుల ఆటలు చెల్లవన్నారు. మన నాయకుడు 74 ఏళ్ల వయస్సులో యువకుడిలా బాన్సువాడ నియోజకవర్గంలో సేవలందిస్తున్నారని, శ్రీనివాస్ రెడ్డికి కుటుంబం కంటే నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని,నేనున్నా అంటూ ముందుకు నడుస్తున్న ఏకైక నాయకుడు పొచారం అని చెప్పారు. 1994 విజయంలో సాదించిన విధంగా ఈ సారి  కూడా అదే విధంగా లక్ష మెజార్టీ తేవాలన్నారు. 15 రోజులు కష్టపడి మన నాయకుడికి తృప్తినిచ్చే విధంగా మెజార్టీ అందించాలన్నారు.
నియోజకవర్గంలో గత పదేళ్ళలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గూగుల్ లో కొడితే దేశంలో ఎవ్వరు చేయ్యని 11,000 డబుల్ బెడ్ రూమ్ లను కట్టిచ్చిన ఘనత పొచారందేన్నారు.
 రూ. 200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ. 150 కోట్లతో జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలు నిర్మాణం జరుగుతుందన్నారు. మంత్రి కేటీఅర్ గారి సహాకారంతో వందల కోట్లు తెచ్చి బాన్సువాడ ను పోచారం  గారు అభివృద్ధి చేశారన్నారు.

గతంలో ఎట్ల ఉండే తెలంగాణ,  గతంలో బాన్సువాడ ఎట్లండే ఇప్పుడేట్లుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో పింఛను 2 వేలు ఇస్తున్నారా ? కళ్యాణలక్ష్మీ ,షాధి ముబారక్ పథకం బి జె పి .కాంగ్రెస్ పార్టీ లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రేవంత్ ఓ బ్రోకర్ పిసిసి రేవంత్ రెడ్డి ఒక పక్క బ్రోకర్ రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి హైదరాబాద్ చుట్టూ ఎందరో పేదల భూములు లాక్కొని వాళ్ళకు అన్యాయం చేసిండన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏం పని చేయకపోబట్టే ప్రజలు నిన్ను ఓడించి ఇంటికి పంపించారని, దిక్కులేక బాన్సువాడ కు వచ్చినవన్నారు.
మొదట బిజెపి లోకి పోయి మళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి 25 కోట్లు రేవంత్ రెడ్డి కి ఇచ్చి  బాన్సువాడ టికెట్ తెచ్చుకున్నాడన్నారు. బాన్సువాడ కాంగ్రెస్ లో మగాళ్ళు లేరా అని అడుగుతున్నానని అన్నారు.
తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామంలో ఏనుగు రవీందర్ రెడ్డి 300 ఎకరాలు కబ్జా పెట్టిండని, ఇందులో దళితులు‌, గిరిజనుల భూములు ఉన్నాయని అన్నారు.
అడ్డం తిరిగిన వాళ్ళను పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టించి ఆ అరుపులు విని ఆనందించే వ్యక్తి ఏనుగు రవిందర్ రెడ్డి అన్నారు.
బాన్సువాడ లో ఇల్లు కట్టుకుంటా అని చెబుతున్నాడని, మరి నీ స్వంత నియోజకవర్గం ఎల్లారెడ్డి లో నీకు ఇల్లు ఉన్నది. మరి అక్కడ ఎందుకు పోటీ చేయవు ? అని ప్రశ్నించారు.గతంలో పార్టనర్ ను మోసం చేసి స్టోన్ క్రషర్ మిల్లును లాక్కున్నాడని,కార్యకర్తలు, నాయకుల నుండి పది శాతం కమిషన్ వసూలు చేసేవాడని ఆరోపించారు. అలాంటి నీవా పోచారం శ్రీనివాసరెడ్డి  విమర్షించేదన్నారు. ఇంక బిజేపీ అభ్యర్థి రెండు సంవత్సరాలు MLA గా ఉండి భూ కబ్జాలు చేసిండని,
ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో హిందూ ముస్లింల మద్య మత గొడవలు పెట్టడానికి ఇక్కడకు వస్తుండన్నారు.

కానీ ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండగా ఈ ఆటలు సాగవని,
ఎవ్వరు ఏమి చేయలేరని, అలాంటి దుర్మార్గులను తరిమి కొట్టండని,. మీ వెనుక నేను ఉంటానని అన్నారు.మా కుటుంబం ఇక్కడే పుట్టామని,ఇక్కడే పెరిగామని, ఇక్కడే మా కట్టె కాలుతుందన్నారు.
ఇంటోనికి మాత్రమే బాధలు తెలుస్తాయని, బయటోడిది సవితి తల్లి ప్రేమని, మనమంతా ఒక కుటుంబమని అన్నారు.
మన నియోజకవర్గంలోని యువతకు ఉపయోగపడే విదంగా 2017 లో PBR ఉచిత కోచింగ్, PBR మెగా జాబ్ మెళా ఏర్పాటు చేయించానన్నారు. ఈ పదిహేను రోజులు మనమందరం కష్టపడి మన నాయకుడు పోచారంని భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఆయన వెంట నాయకులు మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, పాత బాలకృష్ణ, గురువినాయ్ కుమార్ తదితరులు ఉన్నారు.