ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేస్తే చర్యలు

ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేస్తే చర్యలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కొంత మంది వ్యక్తులు ఎలక్షన్లో తమ స్వలాభం కోసం, ఓట్ల కోసం ప్రజల దృష్టి మరలచుకోవడానికి ఫేక్ మెసేజ్లు , ఫేక్ వాయిస్ మెసేజ్ లు , ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, ఇలాంటివి ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి మెసేజ్లు సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సప్ , ట్విట్టర్లలో మిగతా సోషల్ మీడియా యాప్లలో పోస్ట్ చేయకూడదని, ఫార్వర్డ్ చేయకూడదని తెలిపారు. ఎవరైనా పైన తెలిపినట్లు పోస్ట్ చేసినా, ఫార్వర్డ్ చేసిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.