నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం : పోచారం భాస్కర్ రెడ్డి

నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం : పోచారం భాస్కర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల తో నష్టపోయిన పంటలకు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి  ఇప్పటికే ప్రకటించారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం మోస్రా మండలం పరిధిలో కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నేలపాలవడం బాధాకరమన్నారు. నష్టపోయిన వారిలో చిన్న రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని, రైతులు మనోధైర్యం కోల్పోకుండా దైర్యంగా ఉండాలని అన్నారు.

రెవెన్యూ, వ్యవసాయ శాఖలు వెంటనే సంయుక్తంగా సర్వే చేసి పంట నష్టంపై వివరాలను సేకరించాలని అధికారులకు చెప్పామన్నారు. యాసంగిలో పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం  రైతులకు నిత్యం సూచిస్తున్నారని అన్నారు.

రైతులు ఆలోచన చేసి ముందస్తుగా వరి నార్లు పోసుకోవాలని విజ్ఞప్తి చేశారు.