అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు-తృటిలో తప్పిన ప్రమాదం
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రయాణికులతో నిండుగా ఉన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన జారిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన మంగళవారం గాంధారి మండల కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమెట్ శివారులో గల బాన్సువాడ - కామారెడ్డి రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వంగిపోయింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గుర్యయ్యారు. సరైన సమయంలో బస్సు ఆగిపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం తో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికి పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడడం గమనార్హం.