రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకి ఎంపికైన  విద్యార్థులు

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకి ఎంపికైన  విద్యార్థులు

శాయంపేట, ముద్ర : స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు ఎస్డిఎల్సీ క్రీడా మైదానంలో డిసెంబర్ చివరి వారంలో  నిర్వహించారు. ఈ పోటీలలో శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామ విద్యార్థులు సయ్యద్ రేష్మ, సయ్యద్ అమీర్ అండర్ -14 విభాగంలో  అద్భుతమైన ఆటను ప్రదర్శించి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగే అండర్-  14 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఎంపికైన ఈ విద్యార్థులని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అల్లం మాదవి, పిఈటి జట్టి రాజేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ రాజేందర్ అభినందించారు