ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలి

బాన్సువాడ, ముద్ర: పుర ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ 2023-24 బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేసవికాలంలో పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సుమారు 20 లక్షలతో బోర్లు, పంపుసెట్లు, మరో 30 లక్షలతో రోడ్లూ, డ్రైనేజీలు నిర్మించేందుకు తీర్మానించారు. ఈ సమావేశంలో కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, లింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.