ఆలోచించి ఓటు వేయండి      

ఆలోచించి ఓటు వేయండి      
  • అభివృద్ధి పై చర్చ జరగాలి               
  • కామారెడ్డి-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా పని చేస్తా                      
  • సీఎం కేసీఆర్                        

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుం డా, వారి వెనుక ఉన్న పార్టీ గత చరిత్ర ఏంటి? వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు? అన్నది ఆలోచించి ఓటు వెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జరిగిన ప్రజా ఆశీర్వద సభలో ఆయన ప్రసంగించారు.  కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని, బీఆర్ఎస్ కూడా పదేళ్లు పాలించిందని, ఎవరి కాలంలో ఏం జరిగిందో, బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో బేరీజు వేసుకోవాలని అన్నారు.సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. పదేళ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఏంటనేది ప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు. ఎక్కడ చూసినా కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు,  పంటలు పండక హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు ఉన్న తెలంగాణ లో కాళేశ్వరం కట్టుకున్నామన్నారు.  కాల్వల ద్వారా రైతులకు నీటితీరువా లేకుండా నీళ్లు పారించి కరువును పారదోలామని అన్నారు.మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ నాపై ఒత్తిడి తెచ్చాడని,. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్ రావాల్సి ఉండగా, రూ.5 వేల కోట్లు కట్ చేస్తామని బెదిరించారని అన్నారు. అయినా బెదర లేదని, మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని,  ఇప్పుడు వారే పాలకులుగా మారారని,. వలసలు ఆగిపోయాయని, పెన్షన్ను మొదట వెయ్యి చేసి, ఇవ్వాల రెండు వేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. దాని రూ.5 వేలకు పెంచు కోబోతున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు, దళితబంధు తీసుకొచ్చామని,. తలసరి విద్యుత్ వినియోగంలోనే కాదు, ఆదాయంలోనూ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లామన్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లున్న తెలంగాణ ఎట్ల మారిందని అన్నది కన్పిస్తుందని, పేదలకు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన బియ్యం ఎంత? ఈనాడు ఇస్తున్న బియ్యం ఎంత? ఆలోచించాలని అన్నారు. వచ్చే మార్చి నుంచి రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తామని, మళ్లీ అధికారం లోకి రాగానే గిరిజనబంధు అమలు చేస్తామని అన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే....

కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్ననాడు ఏ పేదలనూ చూడలేదని, ఈసారి పొరపాటున కాం గ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ పోవుడు ఖాయమని అన్నారు. రైతుబంధు, దళితబంధు కట్ చేస్తారని అన్నారు.  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలు అడ్డగో లుగా మాట్లాడుతున్నారన్నారు. ధరణి తీసేసే వాళ్లు, 24గంటల కరెంటు వద్దని, 3 గంటల కరెంటు ఇచ్చే వాళ్లు, 10 హెచ్పీ మోటార్ పెట్టుకోమనేవాళ్లు, రాజ్యానికి వస్తే రైతుల గతి ఏమవుతుందో ఆలోచన చేయాలన్నారు. రైతులు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటార్లు వాడుతుంటే పీసీసీ అధ్యక్షుడు 10 హెచ్పీమోటార్లు పెట్టుకోమంటున్నారని,. మరి మోటార్లు ఎవరు కొనివ్వాలి? 24 గంటల కరెంటుఇస్తున్న మన రాష్ట్రానికి వచ్చి.. మా కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటున్నారని అన్నారు.   రైతుబంధుతో డబ్బులు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమక్కుమార్రెడ్డి ఆరోపిస్తున్నారని,. 3 గంటల ఉచిత విద్యుత్ చాలని ప్రస్తుత పీసిసి అధ్యక్షుడు అంటున్నారని అన్నారు. రాహుల్, సీఎల్పీ నేత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? ఎవరి పాలనలో ఏంచేశారు అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. అంతేకానీ ఓటు వేసేటప్పుడు గాయ్ గాయ్ అయిఅమూల్యమైన ఓటును గంగపాలు చేయొద్దన్నారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ సౌమ్యుదని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, తమ్ముడులాంటి వాడని అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తాను ఎమ్మెల్యే గా పని చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. జాజుల సురేందర్ మాట్లాడుతూ సీఎం సహకారం తో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.