బాన్సువాడ కాంగ్రెస్ లో టిక్కెట్ రగడ

బాన్సువాడ కాంగ్రెస్ లో టిక్కెట్ రగడ
  • స్థానికేతరుడికి టిక్కెట్                           
  • ఆమరణ దీక్ష చేపట్టిన కాసుల                                            

బాన్సువాడ, ముద్ర: మూడవ విడత జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. మూడవ విడతలో కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, జుక్కల్ నుంచి లక్ష్మి కాంత్ రావు, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అయితే బాన్సువాడ లో  టిక్కెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజు ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  స్థానికేతరుడైన ఏనుగుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారని, తాను ఐదేళ్లు గా పార్టీ అభివృద్ధి కోసం కృషి చెస్తున్నానని ప్రశ్నించారు. మంగళవారం నాడు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. బుధవారం నాడు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా కాంగ్రెస్ లోని మరో వర్గం వారు ఏనుగు రాకను స్వాగతిస్తున్నారు. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి 'ఎవరికి వారే యమునా తీరే'లా మారింది.  పార్టీలో సఖ్యత కోసం కృషి చేసే వరకే ప్రచార పర్వం ముగుస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  ఎన్నికల్లో ప్రచారానికి కేవలం 18 రోజులు మిగిలాయి.