ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలి
- బీఆర్ఎస్ పాలనలో అంత అవినీతి జరిగింది
- కుటుంబ పాలనను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది
- బిజెపి అభ్యర్థి అందే బాబయ్య
- నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి అందే బాబయ్య
ముద్ర, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందే బాబయ్య నామినేషన్ సందర్భంగా ఎల్లికట్ట భవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు , కార్యకర్తలతో, భారీ ర్యాలీగా బయల్దేరి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. అందె బాబయ్యకు మద్దతుగా కేంద్రమంత్రి సర్వానంద సోనోవాల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపి నాయకత్వం తనను నమ్మి టికెట్ కేటాయించిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేసుకుంటానని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వం లో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, బీజేపీ పార్టీ ఏదైనా హామీ ఇస్తే 100% హామీని నెరవేరుస్తుందని అన్నారు, బీఆర్ఎస్ పాలనలో అంత అవినీతి జరిగిందని, కుటుంబ పాలనను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.