చిరు వ్యాపారులను గెలిపించాలని  కోరిన తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి

చిరు వ్యాపారులను గెలిపించాలని  కోరిన తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి
  • నాలుగు వారాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది
  • అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది
  • తాండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బు మనోహర్ రెడ్డి విస్తృత ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం  కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం  తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిర్వహించారు. చిరు వ్యాపారులను కలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇక నాలుగు వారాలలో  ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది చేరుతున్నారనీ అన్నారు . మీకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మనోహార్ రెడ్డి అభ్యర్థించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, రైతు బందు ఏటా ఎకరానికి 15 వేలు,కౌలు రైతులకు 12 వేలు పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు,500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.