అనంతగిరిలో అల్లాడుతున్న వన్యప్రాణులు..!

అనంతగిరిలో అల్లాడుతున్న వన్యప్రాణులు..!
Ananthagiri forest

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో నీరు లేక వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. వన్యప్రాణులకు మీరు అందించేందుకు అటవీ ప్రాంతంలో అక్కడక్కడ సాసర్ ప్లేట్లను ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. కానీ వాటిలో నీరు లేకపోవడంతో నిరుపయోగంగా మారి వన్య ప్రాణుల పాలిట శాపంగా మారాయి.

వేసవికాలం రాకమునుపే ఈ పరిస్థితి ఉంటే ఇక వేసవి కాలంలో వన్యప్రాణులు ఎంతలా అల్లాడుతాయోనని జంతు ప్రియులు వాపోతున్నారు. తక్షణమే జిల్లా అటవీశాఖ అధికారులు స్పందించి సాసరు ప్లేట్లను నీటితో నింపి అడవి జంతువుల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.