షాబాద్ మిని హైదరాబాద్...

షాబాద్ మిని హైదరాబాద్...
  • కేటీఆర్ ప్రత్యేక కృషి వల్లే షాబాద్ కు అంతర్జాతీయ కంపెనీలు...
  • అంబేడ్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

చేవెళ్ల : రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్దితో పని చేసి, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చెయ్యాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలం, కొమర బండ గ్రామంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న "హై లెవెల్ బ్రిడ్జి" శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర భూ గర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి పాల్గొని, ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు షాబాద్ నిరాదరణకు గురైందని, స్వరాష్ట్రంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగవంతంగా అభివృద్ధి చెందిందన్నారు.

నాడు ఒక మండలంగా ఉన్న షాబాద్, నేడు మిని హైదరాబాద్ ఆవిర్భవించిందన్నారు. గుజరాత్ లో ఏర్పాటు చేయబోయే వెల్స్పన్ కంపెనీ మంత్రి కేటిఆర్ ప్రత్యేక కృషి వల్లే షాబాద్ కు వచ్చిందని తెలిపారు. షాబాద్ ఇప్పుడు అమెజాన్, వెల్స్పన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలకు అడ్డాగా మారిందన్నారు. ప్రపంచం మొత్తం నేడు షాబాద్ గురించే మాట్లాడుకుంటుందని, మంత్రి కేటిఆర్ కృషి వల్లే షాబాద్ సుస్థిర అభివృద్ది సాద్యమైనదన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి ఈ ప్రాంత వాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తలంతా రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టుగా బీ ఆర్ ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. చెప్పిందే చేసి, చేసిందే చెప్పే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఇలాంటి పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా తప్పక ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంబేడ్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా సమస్యల పట్ల గానీ, సంక్షేమ పథకాల పట్ల గానీ అవగాహన లేదని, అందుకే మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కాపీ కొడుతూ మొన్న చేవెళ్ల సభలో డిక్లరేషన్ ప్రకటించారన్నారు. నిజంగా దళితుల అభివృద్ది మీద చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం మన సంక్షేమ పథకాలలో పది శాతం ఇచ్చి చూపించాలని సవాల్ విసిరారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను ఎన్నికల్లో ఓడగొట్టి అవమానించిన కాంగ్రెస్ పార్టీ, నేడు దళిత సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్ పి చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, జెడ్ పి టి సి పట్నం అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.